BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 09:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం ఊటుకూరులో పోలీసుల పల్లె నిద్ర....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 09:25 PM
67 వీక్షణలు

గంపలగూడెం ఊటుకూరులో పోలీసుల ‘పల్లె నిద్ర’.. ఎన్నికల వేళ భద్రతపై ప్రత్యేక దృష్టి

ఊటుకూరు:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ మార్గదర్శకత్వంలో, మైలవరం ఏసీపీ పర్యవేక్షణలో తిరువూరు సీఐ కే. గిరిబాబు, గంపలగూడెం ఎస్సై జీ. అనిల్‌తో పాటు పోలీసు సిబ్బంది గురువారం రాత్రి గ్రామంలో బస చేశారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలోని సున్నిత ప్రాంతాలను పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామస్తులతో సమావేశమై స్థానిక సమస్యలు, భద్రతా అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ‘ఖాకీ స్టూడియో’ వీడియో ప్రదర్శన ద్వారా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత గంజాయి, బెట్టింగులు, ర్యాష్ డ్రైవింగ్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

ప్రజల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అధికారులు భరోసా ఇచ్చారు. పోలీసులే స్వయంగా గ్రామంలో రాత్రి బస చేసి సమస్యలు తెలుసుకోవడం పట్ల ఊటుకూరు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.