BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 08:09 pm
Posted by : GOUTHAM RUDRARAPU

బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి

తెలంగాణ
/ సంగారెడ్డి / అమీన్‌పూర్
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
27 Aug, 2026 - 08:09 PM
63 వీక్షణలు

బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి - స్థానికుల్లో హర్షం

బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు ఉన్న ప్రధాన రహదారిపై సుదీర్ఘ కాలంగా వెలగని స్ట్రీట్ లైట్లను ఎట్టకేలకు అధికారులు మరమ్మతులు చేయించారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో ప్రయాణం క్లిష్టంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, వెంటనే స్పందిించి మరమ్మతు పనులను చేపట్టారు. సంబంధిత విభాగానికి చెందిన సిబ్బంది, క్రేన్ మరియు అవసరమైన పరికరాలతో స్ట్రీట్ లైట్లను తనిఖీ చేసి, సాంకేతిక లోపాలను సరిదిద్దారు. చెడిపోయిన బల్బులను మార్చి, వైరింగ్ సమస్యలను పరిష్కరించారు.

ప్రస్తుతం బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు ఉన్న అన్ని స్ట్రీట్ లైట్లు పనిచేస్తున్నాయని, దీంతో రాత్రి వేళల్లో ఈ ప్రాంతం సురక్షితంగా మారిందని అధికారులు తెలిపారు. స్ట్రీట్ లైట్లు తిరిగి వెలగడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వేగవంతమైన చర్యలను వారు అభినందిస్తున్నారు.