BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 06:23 pm
Posted by : కూనురు మధు

ఓటర్ల జాబితాలో పేర్లు సరిచూసుకోవాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Aug, 2026 - 06:23 PM
129 వీక్షణలు

ఓటర్ల జాబితాలో పేర్లు సరిచూసుకోవాలి

ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిగా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని, రెండో దశ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత పత్రాలను బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్‌ఓ) అందజేసి తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని బీఎల్ఏల ఇన్‌చార్జి పల్లపు బుద్ధుడు సూచించారు. చిట్యాల మండలంలోని ఉరుమడ్ల, తాళ్లవెల్లంల గ్రామాల్లో గురువారం నిర్వహించిన ఓటర్ల జాబితా రెండో దశ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కోరారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, రెసిడెన్షియల్ సర్టిఫికెట్‌తో పాటు చదువుకున్న వారు తమ విద్యార్హతల సర్టిఫికెట్లను అవసరమైన మేరకు జత చేసి బీఎల్‌ఓలకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో  భాగంగా ఉరుమడ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి భానుశ్రీ భిక్షం, తాళ్లవెల్లంల గ్రామపంచాయతీ సర్పంచ్ జోగు సురేష్ పాల్గొని, నోటీసులు అందుకున్న ప్రతి ఓటరూ నిర్ణీత ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. చిట్యాల మండలంలో 100 శాతం ఓటర్ల నమోదు లక్ష్యాన్ని సాధించేందుకు బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పరస్పరం సహకరించాలని పల్లపు బుద్ధుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్‌ఓలు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.