BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 08:28 pm
Posted by : కూనురు మధు

రసాయన లీకేజీతో జాతీయ రహదారిపై ఇబ్బందులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Aug, 2026 - 08:28 PM
307 వీక్షణలు

రసాయన లీకేజీతో జాతీయ రహదారిపై ఇబ్బందులు

 నల్గొండ జిల్లా చిట్యాల మండలం సమీపంలోని హానర్ ల్యాబ్‌ నుంచి బయటకు వెళ్లిన ఓ ట్యాంకర్‌ నుంచి విషపూరిత స్థానికులు రసాయనాలు రోడ్డుపై పడటంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రసాయనాలు రోడ్డుపై చిందడంతో పరిసర ప్రాంతాల్లో ఘాటైన వాసన వ్యాపించి, జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ట్యాంకర్‌ నుంచి రసాయనాలు రోడ్డుపై పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, కంపెనీ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర రసాయనాల రవాణాలో నిబంధనలు పాటించకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. వెలిమినేడు, చిట్యాల పరిసర ప్రాంతాల్లో గతంలో కూడా రసాయనాలను తరలించే ట్యాంకర్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రసాయన పరిశ్రమలు, ట్యాంకర్ల రవాణాపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రసాయనాలు రోడ్డుపై పడిన ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.