BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 09:05 pm
Posted by : SHAIK CHAND BASHA

అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
27 Aug, 2026 - 09:05 PM
66 వీక్షణలు
అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం

పులివెందుల

మహిళా విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ– ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో
జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా గురువారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్ నేత్రనిధి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్, స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్ర సేకరణ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనిత మరియు స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం” అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక వ్యక్తి నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు వెలుగు ప్రసాదించవచ్చని, సమాజంలో నేత్రదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీనిత మాట్లాడుతూ, నేత్రదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా అంధుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని తెలిపారు. విద్యార్థినులు చేపట్టిన ఈ అవగాహన ర్యాలీ ప్రజల్లో నేత్రదానంపై చైతన్యం కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యార్థినులు కళాశాల ప్రాంగణం నుండి ప్రారంభించిన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. “నేత్రదానం మహాదానం”, “నేత్రదానం చేద్దాం – అంధులకు చూపు ఇద్దాం”, “మరణానంతరం నేత్రదానం చేయండి – జీవితాలను వెలిగించండి” వంటి నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ర్యాలీని చూసిన ప్రజలు విద్యార్థినుల సేవాభావాన్ని అభినందించారు. ర్యాలీ అనంతరం పూల అంగళ్ల కూడలిలో విద్యార్థినులు మానవహారంగా ఏర్పడి నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పారు. అనంతరం అందరూ కలిసి నేత్రదాన ప్రతిజ్ఞ చేశారు. మరణానంతరం తమ నేత్రాలను దానం చేసి అంధులకు వెలుగు నింపేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, నేత్రదానం ద్వారా ఎన్నో కుటుంబాల్లో ఆశాకిరణాలు వెలిగించవచ్చని తెలిపారు. నేత్రదానం గురించి అపోహలను తొలగించి ప్రతి కుటుంబం నేత్రదానానికి ముందుకు రావాలని కోరారు. డాక్టర్ అగర్వాల్ నేత్రనిధి సహకారంతో జిల్లాలో నేత్రదానంపై మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు శ్రీనివాసులు, ఓబుల్ రెడ్డి, డాక్టర్ అగర్వాల్ నేత్రనిధి ప్రతినిధులు, స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ అరవింద్ కుమార్, సేవాసమితి సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.