BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 05:02 pm
Posted by : PEDDABOINA SRIKANTH

హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
27 Aug, 2026 - 05:02 PM
72 వీక్షణలు

హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన

  • సుబేదారి పోలీస్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ శ్రేణులు, పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన

హనుమకొండ | N Today News

జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేపట్టిన కార్యక్రమం నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారంటూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హనుమకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన హరీశ్‌రావును అరెస్ట్ చేయడం సరికాదని విద్యార్థులు, బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఏమిటంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని, అవసరమైతే ఢిల్లీ వరకు రాస్తారోకో చేపడతామని హెచ్చరించినట్లు తెలిపారు.

జీవో 97ను రద్దు చేయడంతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు.