BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 09:07 pm
Posted by : SHAIK CHAND BASHA

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
27 Aug, 2026 - 09:07 PM
61 వీక్షణలు

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

పులివెందుల అర్బన్:

పులివెందులలో పోలీసుల విస్తృత తనిఖీలునిబంధనలు

ఉల్లంఘించిన 19 మందికి జరిమారోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పులివెందుల ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు స్పష్టం చేశారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలు,డీఎస్పీ బుక్కే మురళి సూచనల మేరకు గురువారం పులివెందుల పట్టణంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

పూల అంగళ్ళ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు,నాలుగు రోడ్ల కూడలిలో టౌన్ ఎస్సై తిమోతి,పాత బస్టాండ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ ఎస్సై గంగాధరరెడ్డి వాహనాల తనిఖీలు చేపట్టారు.ముఖ్యంగా సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగులు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు మాట్లాడుతూ దేశంలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోజుకు సగటున 28 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సమీప ప్రాంతాలకే కదా అని నిర్లక్ష్యం చేయకుండా ఇంటి నుంచి బైక్‌పై బయటకు వచ్చే ప్రతిసారీ హెల్మెట్ పెట్టుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని,ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ప్రతి వాహనదారుడు సక్రమమైన ఆర్సీ,డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు.నిబంధనలు పాటించకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణించిన 19 మంది వాహనదారులను గుర్తించి వారికి జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.