BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 14 June 2026, 06:06 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

అభివృద్ధి పథంలో ధర్మపురి మున్సిపాలిటీ.. ప్రతి వార్డుకూ పెద్దపీట

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
14 Jun, 2026 - 06:06 PM
114 వీక్షణలు

అభివృద్ధి పథంలో ధర్మపురి మున్సిపాలిటీ.. ప్రతి వార్డుకూ పెద్దపీట

​ధర్మపురి, జూన్ 14: 

ధర్మపురి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి అడుగులు వేస్తున్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో సమానమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమె ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు.

​4వ వార్డులో నూతన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

పట్టణంలోని 4వ వార్డులో అత్యవసరమైన నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు శ్రీమతి వేముల నాగలక్ష్మి గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం కావడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు గణనీయంగా తగ్గుతాయని, ఇది ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

​ప్రతి వార్డులోనూ స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ సంఘనబట్ల దినేష్, కౌన్సిలర్లు కొమిరెల్లి పవన్, సంఘనబట్ల సంతోషి, చిపిరిశెట్టి రాజేష్, సంగి ఆనంద్, వొజ్జెల లక్ష్మణ్, కోఆప్షన్ సభ్యులు ఎస్.కె. షౌకత్, గరిగే అరుణతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజలు మరియు నాయకులు పాల్గొన్నారు.