BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 13 June 2026, 10:39 am
Posted by : రావిపాటి ప్రభాకరావు

సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
13 Jun, 2026 - 10:39 AM
110 వీక్షణలు

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పలు అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.

ప్రభుత్వం త్వరలో సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ అమలు చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రతి శాఖ ఉద్యోగికి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో పాటు అంతర్‌జిల్లా బదిలీలు, స్పౌజ్ ట్రాన్స్‌ఫర్లు అమలుపై కూడా పరిశీలన జరుగుతోంది. ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ అయిన పే స్కేల్ అమలు కోసం కూడా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, వైద్య, రెవెన్యూ శాఖలకు చెందిన 7,246 మంది సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు.

అదేవిధంగా ఉద్యోగుల పనిభారం తగ్గింపు, సెలవుల ఆమోదంలో సౌలభ్యం, గ్రీవెన్స్‌ల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

సచివాలయ ఉద్యోగుల సంక్షేమం, సేవా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలకు సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.