BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెటా ఇండియా హెడ్ కేసు: సిటీ సైబర్ క్రైమ్ డీసీపీపై వేటు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 07:20 PM
62 వీక్షణలు

మెటా ఇండియా హెడ్ కేసు: సిటీ సైబర్ క్రైమ్ డీసీపీపై వేటు

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ తెలంగాణ బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా ఇండియా హెడ్‌ను కూడా నిందితుడిగా చేర్చడం జాతీయ స్థాయిలో వివాదానికి దారితీసింది.

సోషల్ మీడియాలో వ్యక్తులు చేసిన పోస్టులకు మెటా సంస్థను ఎలా బాధ్యురాలిగా చేస్తారనే అంశంపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై వేటు వేసింది.

ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అరవింద్ బాబును డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రావడంతో ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.