వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
తెలంగాణ
/
నల్గొండ
/
శాలిగౌరారం
శాలిగౌరారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం
శాలిగౌరారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులతో శాలిగౌరారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని, అలాగే డీజేలకు అనుమతి లేదని నిర్వాహకులకు పోలీసులు సూచించారు.
వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను నిర్వహిస్తూ, పోలీసుల సూచనలు మరియు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు తెలిపారు.