www.ntodaynews.com
పోలిశెట్టిపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
పోలిశెట్టిపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
తిరువూరు నియోజకవర్గం, ఏ.కొండూరు మండలం: పోలిశెట్టిపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా వాసం మునియ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి పారదర్శకంగా, సమయానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొమ్ము రాజేష్, గోదా చెన్నారావు, చిట్టూరి సుధారామ్, పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.