BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 16 September 2026, 09:42 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పోలవరం–చింతూరు ఏజెన్సీలో విషాదం.. వరద ప్రవాహంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 Sep, 2026 - 09:42 AM
7 వీక్షణలు

పోలవరం, ఏలూరు జిల్లా: పోలవరం–చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల బృందంలో ఓ యువకుడు వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్నేహితుల కళ్ల ముందే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.

గల్లంతైన వ్యక్తిని విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నీలేష్‌గా గుర్తించారు. సరదాగా విహారయాత్రకు వచ్చిన స్నేహితుల బృందంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో మిగిలిన వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

స్నేహితులు చూస్తుండగానే నీలేష్‌ వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో వారు వెంటనే అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది గల్లంతైన నీలేష్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.