BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 16 September 2026, 09:45 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మదనపల్లెలో బైక్‌ స్టంట్లకు అడ్డుకట్ట ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 Sep, 2026 - 09:45 AM
5 వీక్షణలు

జాతీయ రహదారి, బైపాస్‌ రోడ్డుపై యువకులు, మైనర్ల వీలింగ్‌.. ప్రమాదాలపై వాహనదారుల్లో ఆందోళన

అన్నమయ్య జిల్లా | మదనపల్లె | Ntoday News

మదనపల్లె పట్టణ పరిధిలో బైక్‌ స్టంట్లు, ప్రమాదకరమైన డ్రైవింగ్‌పై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబై–చెన్నై జాతీయ రహదారి, బైపాస్‌ రోడ్డుపై కొందరు యువకులు, మైనర్లు బైక్‌లతో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలతో బైక్‌లను నడపడం, ముందు చక్రాన్ని పైకెత్తి వీలింగ్‌ చేయడం, అధిక వేగంతో దూసుకెళ్లడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని వాహనదారులు చెబుతున్నారు. రాకపోకలు సాగుతున్న సమయంలోనే ఇలాంటి స్టంట్లు చేయడంతో ఇతర వాహనదారులు, పాదచారులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మైనర్‌ డ్రైవింగ్‌పై ఇటీవల రాయచోటి, మదనపల్లెలో డ్రోన్‌ కెమెరాల సహాయంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే మదనపల్లె ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 

అయితే బహిరంగ రహదారులపై ప్రమాదకరమైన బైక్‌ స్టంట్లు చేస్తున్న వారిపై మరింత కఠినంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. హెల్మెట్‌ లేకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై జరిమానాలు విధిస్తున్న పోలీసులు, వీలింగ్‌, అతివేగం, సైలెన్సర్‌ మార్పులు వంటి ప్రమాదకర చర్యలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. ముందుగానే ప్రమాదకర బైక్‌ స్టంట్లను అడ్డుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.