ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తులకు మరో అవకాశం....
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అమరావతి :
18వ తేదీ వరకు పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లకు దరఖాస్తు గడువును ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హత ఉన్న వారు సమీపంలోని సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చని సూచించారు.
అర్హులైన ఏ ఒక్కరూ పెన్షన్ ప్రయోజనానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో గడువు పొడిగించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు.
అర్హత ఉన్నవారు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.