BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 01:24 pm
Posted by : యామనూరి మల్లికార్జున

సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
01 Aug, 2026 - 01:24 PM
47 వీక్షణలు

శ్రీశైలం మండలం -సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక - పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్, SP, మిగతా అన్నిశాఖాల ఉన్నతాధికారులు. 

నంద్యాల జిల్లా

శ్రీశైలం నియోజకవర్గం లోని సుండిపెంట గ్రామంలో వన్ మంత్ – ఫోర్ విజిట్” ప్రత్యేక  "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమం ఏర్పాటు....

ప్రత్యేక PGRS ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి.... జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్ IPS 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గంలోని సుండిపెంట గ్రామం నందు రెడ్డి వారి కళ్యాణ మండపంలో నేడు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు “  వన్ మంత్ ఫోర్ విజిట్”     కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను  పరిష్కరించేందుకు ఇది చక్కని అవకాశం అని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. 


ఈ కార్యక్రమం నందు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, మరికొందరు జిల్లా అధికారులు కలసి ప్రత్యేక " "ప్రజాసమస్యల పరిష్కార వేదిక "ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించారు.


అధికారులు వారి వారి శాఖల వారీగా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారమయ్యే సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించడంతోపాటు మరికొన్నింటినీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించే దిశగా కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. 


ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై అధిక ప్రాధాన్యత నిస్తోందని ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తారని భరోసా కల్పించారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.