BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 14 June 2026, 05:15 pm
Posted by : V శ్రీనివాస్

​సింగరేణి సర్వతోముఖాభివృద్ధికి సమిష్టి కృషి

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jun, 2026 - 05:15 PM
372 వీక్షణలు

​కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత

శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు

​సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో ఏర్పాటు చేసిన 'ఓపెన్ హౌస్' కార్యక్రమానికి ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తదితరులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా గనిలో రక్షణ పద్ధతులు, గ్రేడ్ 10, 11 బొగ్గు ఉత్పత్తి, నిల్వ, రవాణా తదితర అంశాలను వారు స్వయంగా పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి తెలంగాణ రాష్ట్ర ఆస్తి అని, ఇందులో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు. తమ చెమటోడ్చి దేశానికి వెలుగులు పంచుతున్న కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, దీనిని అపహాస్యం చేస్తూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.

​కార్మికుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం అధునాతన వైద్య విధానాలను అందుబాటులోకి తెస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా కార్మికుల పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల'ను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వ బడులను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి కార్మికులకు రూ. 1.25 కోట్ల భారీ ప్రమాద బీమా కల్పించామని, అలాగే వారి పిల్లలు యూపీఎస్సీ  తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సమన్వయంతో గనుల అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సింగరేణి సీఎంఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, డీసీపీ ఎ. భాస్కర్, సింగరేణి కార్మిక సంఘం ప్రతినిధి జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు