BREAKING
నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
Date of Publish : 12 June 2026, 03:46 pm
Posted by : NTODAY NEWS

శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
12 Jun, 2026 - 03:46 PM
183 వీక్షణలు

ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు 

సత్యసాయి జిల్లా అమడగూరు మండల కేంద్రంలోని శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఆరవ వసంతోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఆశ్రమం ఆరు సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. ఆశ్రమ సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న మండల పత్రికేయులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు అరుణ జ్యోతి మాట్లాడుతూ, సమాజంలో నిరాశ్రయులు, వృద్ధులకు అండగా నిలిచి వారికి ఆశ్రయం, ఆహారం, ప్రేమాభిమానాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. దాతల సహకారం, ప్రజల ఆదరణతో వృద్ధాశ్రమం విజయవంతంగా ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో సామాజిక సేవకులు, దాతలు, గ్రామ ప్రముఖులు, పత్రికేయులు పాల్గొని వృద్ధాశ్రమం అందిస్తున్న సేవలను కొనియాడారు. వృద్ధుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, ఆశ్రమం మరిన్ని సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.