BREAKING
చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం
Date of Publish : 27 July 2026, 10:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం.. కూటమి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 10:14 PM
144 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో రెండో బూత్ పరిధిలో సోమవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను టిడిపి నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా నక్కా రాము మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్ర ప్రజలకు సురక్షిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల వారు పట్టణాలకు వెళ్లి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పడుతున్నారని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ రూ.4,000, వికలాంగుల పెన్షన్ రూ.6,000 అందించడం దేశంలోనే ఆదర్శ సంక్షేమ కార్యక్రమమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అలాంటి నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని నక్కా రాము పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చనుబండ పీఏసీఎస్ అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, గ్రామ టిడిపి అధ్యక్షుడు చీదిరాల మారేశ్వరరావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, పరసా శ్రీను, బొట్టు దుర్గారావు, మిద్దె చెన్నారావు, నక్కా చెన్నారావు, చెనుబోయిన వెంకటేశ్వరరావు, విస్సంపల్లి పూర్ణ, గుడిమళ్ల బ్రహ్మయ్యతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.