BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 27 July 2026, 10:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో డాక్టర్ వేణుమాధవ్

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 10:02 PM
37 వీక్షణలు

మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో డాక్టర్ వేణుమాధవ్

మధిర, జూలై 27: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ వేణుమాధవ్ సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వీరబాబు, సిబ్బందితో ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. నర్సింగ్ అధికారిని వ్యాక్సిన్ల నిల్వ, అందుబాటులో ఉన్న వైల్స్ వివరాలు అడిగి తెలుసుకుని, కోల్డ్ చైన్ వ్యవస్థను తప్పనిసరిగా సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఆసుపత్రి ప్రయోగశాలలో ఉన్న పరికరాల పనితీరును పరిశీలించి, అవి సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో తరచూ వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి డీఎంహెచ్‌వో ఆదేశించారు.