BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 27 July 2026, 10:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు భారీ షాక్..!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 10:08 PM
75 వీక్షణలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు భారీ షాక్..! పదవి నుంచి తప్పించాలని సంచలన ఆదేశాలు

తెలంగాణ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రంగనాథ్‌ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిందిబిగ్ బ్రేకింగ్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ప‌ద‌వి నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశం

సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇలా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదన్న హైకోర్టు

రంగనాథ్ స్థానంలో ఐజీ అధికారి నియామకానికి ఆదేశం

ఈ మేరకు సీఎస్‌ను ఆదేశించిన హైకోర్టు

సెక్రటరీ హోదాలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం అత్యంత తీవ్ర విషయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

రంగనాథ్ స్థానంలో ఐజీ హోదా కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.