BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 23 July 2026, 08:36 pm
Posted by : SANADI KARNAKAR

పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మేడ్చల్
Reporter
Sanadi karnakar మేడ్చల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్
23 Jul, 2026 - 08:36 PM
84 వీక్షణలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనియన్‌లో సభ్యత్వం పొందిన సనాది కర్ణాకర్.. పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన

హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనియన్‌లో సభ్యత్వం పొందడం తనకు ఎంతో గౌరవంగా, గర్వకారణంగా ఉందని బలహీన వర్గానికి చెందిన సనాది కర్ణాకర్ తెలిపారు. ఈ సందర్భంగా తనను యూనియన్‌లో చేర్చుకున్న అంబేద్కర్ భవన్ చైర్మన్ గట్టు అశోక్, చేపూరి స్వామి, యూనియన్ పెద్దలు, సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో సేవలందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, మెడికల్ షాప్ నిర్వాహకులు, పోలీసు శాఖ అధికారులు, డీఎంహెచ్ఓ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌వోటీ, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు మరియు ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా తన డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా బలహీన వర్గాలకు చెందిన పేద, నిరుపేద కుటుంబాలకు అత్యంత తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ పరీక్షలు అందించే సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ అవసరమైన వైద్య పరీక్షలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సేవా కార్యక్రమం తాత్కాలికం కాదని, తాను హైదరాబాద్‌లో ఉన్నంతకాలం తన శక్తి మేరకు నిరంతరంగా కొనసాగిస్తానని సనాది కర్ణాకర్ స్పష్టం చేశారు. సమాజంలోని బలహీన వర్గాలకు సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు, ల్యాబ్ ఇన్‌చార్జీలు, మెడికల్ షాప్ నిర్వాహకులు, సంబంధిత అధికారులు మరియు ప్రజలందరూ సహకరించి, అవసరమైన వారికి ఈ సేవలను చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.