BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 12 June 2026, 05:23 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
12 Jun, 2026 - 05:23 PM
100 వీక్షణలు

ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు 

ధి:- 12-06-2026 శుక్రవారం ఉదయం 9:40 గంటలకు సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రతివారం నిర్వహించే "ప్రజా దర్బార్ (PGRS)" కార్యక్రమం జరిగింది. 

ఈ కార్యక్రమంలో:- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు  ప్రజల నుండి నేరుగా వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బొండా ఉమా  మాట్లాడుతూ:- ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కూటమి ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ సత్వర పరిష్కారం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ప్రజల అర్జీలు కార్యాలయాలకే పరిమితమయ్యేవని, ప్రస్తుతం ప్రతి వినతిపత్రాన్ని బాధ్యతాయుతంగా పరిశీలించి పరిష్కారం చూపిస్తున్నామని, దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరిగిందన్నారు.

వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు కానున్నాయని వెల్లడించారు. అదేవిధంగా పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా గృహ నిర్మాణ పథకాల అమలుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పాటు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని, ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా మారిందని పేర్కొన్నారు. ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో:- ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, దాసరి ఉదయశ్రీ, Sk గౌసియా, భాగ్యలక్ష్మి, పైడి శ్రీను, జలకం రాజా, తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.