BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​ఓటర్ల జాబితా క్షేత్రస్థాయి పరిశీలనలో బీఎల్ఏల పాత్ర కీలకం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jun, 2026 - 06:06 PM
129 వీక్షణలు

మంచిర్యాలలో ఘనంగా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, బీఎల్ఏల అవగాహన సదస్సు

హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి పద్మావతి గార్డెన్‌లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’పై అవగాహన శిక్షణా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా నమోదు, సవరణ ప్రక్రియలో బీఎల్ఏలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వెళ్లి సమగ్రంగా సమాచారాన్ని సేకరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కేలా బాధ్యతగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

​ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ (పరిశీలకులు) రహ్మత్ హుస్సేన్, మాస్టర్ ట్రైనర్ అవేజ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావు, డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, మహిళా, యువజన కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు