BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 13 June 2026, 12:27 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
13 Jun, 2026 - 12:27 PM
98 వీక్షణలు

ప్రజలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ

 ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశా అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర  ఆధ్వర్యంలో  ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం శనివారం ఉదయం బర్మ్ పార్క్, భవానిపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశా, డైరెక్టర్ ఆయుష్ గోపాలకృష్ణ రోనంకి, జాయింట్ కలెక్టర్ ఇలేకియా పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతంగా గత నాలుగు వారాలుగా నిర్వహిస్తున్నామని, ఒకవైపు యోగాంధ్రతో శరీరాన్ని మనసుని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మరోవైపు ఆపరేషన్ క్లీన్ స్వీప్ తో నగరాన్ని పరిశుభ్రపరుస్తున్నామని అన్నారు. అందులో ముఖ్య పాత్రులైన పారిశుద్ధ్య కార్మికులు, వారు కేవలం కార్మికులు మాత్రమే కాదు దైవికులతో సమానమని అన్నారు. ఎండైనా వానైనా వాతావరణంతో సంబంధం లేకుండా అన్ని పరిస్థితుల్లోనూ నగరాన్ని పరిశుభ్రపరుస్తూ ప్రజల్ని ఆరోగ్యవంతులుగా ఉంచడంలో వారు చేస్తున్న పని  అనిర్వచనీయమన్నారు.  

 ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు  పిలుపుమేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని గత నాలుగు వారాలపాటుగా ప్రతి ఒక్క వారం ప్రత్యేకమైన అంశాలతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు.  మొదటి వారం రెడ్ స్పాట్ ఎల్లో స్పాట్ విసిబుల్ తో పాటు రెండో వారం స్ట్రాం వాటర్ డ్రైన్స్, కాలువల డీసిల్టింగ్ అలాగే మూడో వారం బెల్క్ వేస్ట్ జనరేటర్లకు ఒక ప్రత్యేకమైన వ్యర్ధాల నిర్వహణ పై అవగాహన కల్పించడమే కాకుండా నాలుగు రంగుల  చెత్తబుట్టల వినియోగంపై ప్రజల్లో వివిధ ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కల్పించామని అన్నారు.  ఈ వారం అంశం గార్బేజ్ వన్నెలబుల్ పాయింట్స్ మరియు పబ్లిక్ టాయిలెట్స్ అని అందులో భాగంగా నగరంలోని మరుగుదొడ్లు అన్నిటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిశుభ్రంగా నిర్వహించుకోవటమే కాకుండా ప్రజలు కూడా తమ తమ ఇళ్లలో మరుగుదొడ్లను తరచుగా పరిశుభ్రపరచాలని అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.  ప్రత్యేకంగా గార్బేజ్ వల్లరబల్ పాయింట్స్ లో ఎటువంటి వ్యర్ధాలు లేకుండా ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నామని వాటిని సురక్షితమైన అందమైన ప్రదేశాలుగా మార్చేందుకు  చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఈ సందర్భంగా  డైరెక్టర్ ఆయుష్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తాను ఇతరత నగరాల్లో పనిచేశారని ఏ నగరం విజయవాడ అంతా పరిశుభ్రంగా లేదని, విజయవాడ నగరం కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఒక నగరం మాత్రమే కాకుండా ఒక విదేశీ నగరంగా ఉందని అంత అందంగా, ఆహ్లాదంగా, పరిశుభ్రంగా,  పచ్చని చెట్లతో ఉందని అన్నారు. నగరంలోని నది, మూడు కాలువలు ఉండటం ఎంత కష్టమో వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ విజయవాడ నగరం పరిశుభ్రతకులో  అత్యుత్తమ స్థానంలో నిలుపుకుంటుందని అన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలేకియా మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పారిశుధ్య నిర్వహణలో ఎంతో అత్యుత్తమ స్థానంలో ఉందని దానికి ముఖ్య కారకులైన పారిశుధ్య కార్మికులు ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడుతున్న కష్టం నగర పరిశుభ్రతల్లో కనిపిస్తుందని, ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు అమలు చేయడమే కాకుండా పూర్తిస్థాయిలో వాటిని నిర్వహించడం తాను గమనించారని, అందుకు విజయవాడ నగరపాలక సంస్థకు అభినందనలు తెలిపారు. 

తదుపరి పర్యావరణ పరిరక్షణ కోసం  మొక్కలను నాటడమే కాకుండా దగ్గరిలోని గార్బేజ్ వల్లరబుల్ పాయింట్ని తమ చేతులతో అక్కడున్న వ్యర్ధాలను తీసి పరిశుభ్రపరచటమే కాకుండా అందమైన రంగులు పూసి తరచుగా వ్యర్ధాలు పడే ప్రదేశాన్ని అందమైన ప్రదేశంగా మార్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, శకుంతల, జోనల్ కమిషనర్ కె.షమ్మీ, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, పర్యవేక్షణ ఇంజనీర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ హరీష్, విఎంసి సిబ్బంది పాల్గొన్నారు.


 పౌర సంబంధాల అధికారి 

విజయవాడ నగరపాలక సంస్థ