BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి
Date of Publish : 14 June 2026, 09:25 pm
Posted by : కూనురు మధు

20 ఏళ్ల సర్వీస్ ఉన్నా తప్పని నిరాశ: ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆవేదన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
14 Jun, 2026 - 09:25 PM
251 వీక్షణలు

చిట్యాల, జూన్ 14: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)లో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఉద్యోగ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ప్రభుత్వం తమ ఉద్యోగాలను ఇప్పటికీ రెగ్యులరైజ్ చేయకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


ఫీల్డ్ అసిస్టెంట్ల అభిప్రాయం ప్రకారం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల నిర్వహణతో పాటు అనేక ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తాము నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, తమ సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదని వారు వాపోతున్నారు.

ఒకే వ్యవస్థలో పనిచేస్తున్న ఐకెపి (IKP) సిబ్బందికి పే స్కేలు అమలు చేస్తూ, ఫీల్డ్ అసిస్టెంట్లకు మాత్రం నెలకు కేవలం రూ.12,370 వేతనం మాత్రమే చెల్లించడం వివక్షపూరిత వైఖరికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పనిచేస్తున్నప్పటికీ తాత్కాలిక ఉద్యోగులుగానే కొనసాగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

హరితహారం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వైకుంఠధామాల ఏర్పాటు, నర్సరీల నిర్వహణ, ఇంకుడు గుంతల తవ్వకం, జల సంచయ్ కార్యక్రమాలు వంటి పలు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాల అమలులో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యాల సాధనలో తమ సేవలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తమ 20 ఏళ్ల సుదీర్ఘ సేవలను పరిగణనలోకి తీసుకుని వెంటనే ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర ఉద్యోగ సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ మాజీ అధ్యక్షుడు మర్రి రమేష్ ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.