BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 15 March 2026, 07:48 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా పదవ తరగతి మొదటి పరీక్ష

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
15 Mar, 2026 - 07:48 AM
164 వీక్షణలు

​కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా పదవ తరగతి మొదటి పరీక్ష

​కరీంనగర్: జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదవ తరగతి మొదటి భాష (First Language) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం పరీక్షల సరళి ఇలా ఉంది:

​హాజరు వివరాలు:

​రెగ్యులర్ విద్యార్థులు: మొత్తం 13,137 మందికి గాను 13,122 మంది హాజరయ్యారు. 15 మంది గైర్హాజరయ్యారు.

​ప్రైవేట్ విద్యార్థులు: ముగ్గురు విద్యార్థులకు గాను ముగ్గురూ హాజరయ్యారు (వంద శాతం హాజరు).

​తనిఖీలు మరియు నిఘా:

​పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొత్తం 73 పరీక్షా కేంద్రాలలో 36 కేంద్రాలను ఉన్నతాధికారులు స్వయంగా తనిఖీ చేశారు.

​ఫ్లయింగ్ స్క్వాడ్స్: 4 ప్రత్యేక తనిఖీ బృందాలు 24 కేంద్రాలను తనిఖీ చేశాయి.

​అసిస్టెంట్ కమిషనర్ (ప్రభుత్వ పరీక్షల విభాగం): 4 కేంద్రాలు.

​జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ): 3 కేంద్రాలు.

​జిల్లా విద్యాశాఖాధికారి (DEO): 2 కేంద్రాలు.

​ఆర్డీఓ: 2 కేంద్రాలు.

​మున్సిపల్ కమిషనర్: ఒక కేంద్రం.

​మొదటి రోజు పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) మరియు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి అశ్విని తానాజీ వాకడే గారు ఒక ప్రకటనలో తెలిపారు.

​