BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 15 June 2026, 08:22 am
Posted by : కూనురు మధు

​విద్యార్థులకు నల్గొండ ఎస్పీ కీలక సూచనలు ​

తెలంగాణ
/ నల్గొండ
15 Jun, 2026 - 08:22 AM
234 వీక్షణలు

నూతన విద్యా సంవత్సరం ప్రారంభంవుతున్న సందర్భంగా నల్గొండ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఉత్సాహం, క్రమశిక్షణ, మరియు బాధ్యతతో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూనే, వారి భద్రత కొరకు పలు కీలక సూచనలు చేశారు. అందులో భాగంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలి. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తల్లిదండ్రులు హెల్మెట్ ధరించేలా, కార్లలో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకునేలా గుర్తుచేయాలని కోరారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు వాడకూడదని స్పష్టం చేశారు. ​సైబర్ భద్రత & ఆన్‌లైన్ మోసాలు: ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, ఓటీపీ లు  బ్యాంకింగ్ వివరాలు ఎవరికీ షేర్ చేయవద్దు. అనుమానాస్పద లింకులు, నకిలీ ఆఫర్లు, అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా మాదకద్రవ్యాలు, పొగాకు, మద్యం వంటి హానికర పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి అని . చెడు అలవాట్లు, తోటి స్నేహితుల ఒత్తిడికి లోనుకాకుండా, ఏదైనా సమస్య ఎదురైతే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం తీసుకోవాలని తెలిపారు. చదువుతో పాటు వ్యాయామం, వినోదం, తగిన విశ్రాంతితో కూడిన దినచర్యను పాటించాలని, తోటి విద్యార్థులను, ఉపాధ్యాయులను గౌరవించాలని ఎస్పీ పేర్కొన్నారు. ​ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ఫిర్యాదుల కొరకు కింది నంబర్లను సంప్రదించాలని లేఖలో పేర్కొన్నారు. 


​చైల్డ్ హెల్ప్ లైన్: 1098

​సమగ్ర అత్యవసర స్పందన సేవ: 100 / 112

​సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్: 1930

​నల్గొండ జిల్లా మాదకద్రవ్యాల నిర్మూలన హెల్ప్ లైన్: 8712670266