BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:48 pm
Posted by : K MAHESH

బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:48 PM
19 వీక్షణలు

నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య అభినందనలు

బయ్యారం, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం నూతన కార్యవర్గ ఎన్నికలు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కొత్తపేట–గంధంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గంలో గౌరవ సలహాదారుడిగా బానోత్ మోహన్ జీ, ప్రధాన కార్యదర్శిగా బొర్ర కృష్ణ, కార్యదర్శులుగా భూక్య కవిత, వెట్టి సరోజిని, బానోతు లింగ్యా, ఉపాధ్యక్షులుగా మాలోత్ పార్వతి, కృష్ణకుమారి, కోశాధికారిగా భానోత్ బాలకృష్ణ, ప్రచారకర్తగా సపవత్ సరస్వతి ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక సభ్యులుగా భూక్య రవి, పానుగోత్ వెంకన్న, గుగులోతు మణి, గుగులోతు ప్రేమలత ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు భూక్య ప్రవీణ్ నాయక్‌తో పాటు కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలకంటి సీతారాం రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం నూతన అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ.. మండలంలోని 16 గ్రామపంచాయతీల సర్పంచ్‌లను సమన్వయం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సర్పంచ్‌ల హక్కుల సాధనకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని 16 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.