BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:52 pm
Posted by : K MAHESH

అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:52 PM
24 వీక్షణలు

‘వికసిత్ భారత్ @ 2047: అవకాశాలు, సవాళ్లు’ అంశంపై పరిశోధన పత్రం సమర్పణ

కేసముద్రం, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన విద్యార్థి పట్ల చందుకు అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించే అవకాశం లభించింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న సామ్రాట్ విక్రమాదిత్య విశ్వవిద్యాలయంలో ఇండియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న 63వ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

‘వికసిత్ భారత్ @ 2047: అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై తన పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించనున్నారు. గతంలోనూ పలు జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించిన చందు, ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు.

సాధారణ కార్మిక కుటుంబానికి చెందిన చందు ఈ స్థాయికి చేరుకోవడం గ్రామస్తుల్లో ఆనందం నింపింది. ఆయన తండ్రి పట్ల యాకయ్య కేసముద్రం మున్సిపాలిటీలో సిబ్బందిగా పనిచేస్తుండగా, తల్లి సుమలత రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. కష్టపడి కుమారుడికి ఉన్నత విద్య అందించిన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చందు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా కేసముద్రం మున్సిపల్ కమిషనర్, మాజీ ఉపసర్పంచ్ బానోత్ వెంకన్న చందును సన్మానించి అభినందించారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం దక్కడం తల్లిదండ్రులతో పాటు గ్రామానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.