BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:54 pm
Posted by : K MAHESH

కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం

తెలంగాణ
/ మహబూబ్ నగర్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:54 PM
21 వీక్షణలు

అర్హులైన ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న

కేసముద్రం, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం కేసముద్రం పురపాలక సంఘం కార్యాలయంలో ప్రారంభించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ అల్లం రమా నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఈ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. ప్రజల కష్టాలను గుర్తించి, ప్రతి కుటుంబానికి భద్రత, భరోసా, ఆర్థిక స్థిరత్వం కల్పించే దిశగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ. శ్రీనివాసరావు, కౌన్సిలర్లు దూఢపాక కృష్ణ, తరాల వీరేష్ యాదవ్, రావుల వినయ్ రెడ్డి, బానోత్ అరుణకుమారి, జాటోత్ సుజాత, ఆగే రాము, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.