BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:51 pm
Posted by : K MAHESH

పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:51 PM
20 వీక్షణలు

అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచులు

నెల్లికుదురు, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా పథకం లక్ష్యమని సర్పంచులు నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి, పులి వెంకన్న, తూర్పాటి శంకరయ్య అన్నారు. శుక్రవారం నెల్లికుదురు మండలంలో ఆలేరు, నెల్లికుదురు, మేచరాజుపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ బీమా పథకాన్ని మండల ప్రత్యేక అధికారి జినుగ మరియాన్న, ఎంపీడీవో సింగారపు కుమార్ ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, రైతులకు సబ్సిడీపై యంత్రాల పంపిణీ వంటి పథకాలను ప్రజలకు అందిస్తోందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ బీమా పథకానికి రేషన్ కార్డు కలిగిన ప్రతి నిరుపేద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక కుటుంబంలో 18 నుంచి 58 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, అర్హత పొందిన కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని వివరించారు. అర్హులైన వారు తమ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి నిరుపేద ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉపసర్పంచులు గన్నా హరీష్, మంచాల వెంకన్న, తాళ్లపల్లి వెంకన్న గౌడ్, ఎంపీవో యసం వెంకట్ నారాయణ, పంచాయతీ కార్యదర్శులు యాకూబ్ రెడ్డి, దేవేందర్, అజ్మతుల్లా, పాలక మండలి సభ్యులు, వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.