BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 08:18 pm
Posted by : K MAHESH

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 08:18 PM
15 వీక్షణలు

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా

పెనుగొండలో పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే.. అర్హులు నమోదు చేసుకోవాలని సూచన

కేసముద్రం, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): పేద, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో సర్పంచ్ కంకల లక్ష్మి కొమురయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. నెల రోజుల పాటు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. అర్హులు తమ తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుటుంబ పెద్ద సెల్‌ఫోన్ నంబరుతో గ్రామపంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి నమోదు చేసుకోవచ్చని సూచించారు. బీమా నమోదు కోసం జిరాక్స్ కాపీలు అవసరం లేదని, కార్యాలయాల్లోని సిబ్బంది ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తారని వివరించారు.

కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల బీమా పరిహారం అందిస్తుందని తెలిపారు. నమోదు సమయంలో బీమా పరిహారాన్ని కుటుంబంలోని ఏయే సభ్యులకు ఎంతెంత ఇవ్వాలనే వివరాలను ముందుగానే నమోదు చేసుకునే అవకాశం ఉందని, తదనుగుణంగా పరిహారం పంపిణీ జరుగుతుందని వివరించారు.

రైతు బీమా భూమి కలిగిన రైతులకు మాత్రమే వర్తిస్తుందని, భూమిలేని వ్యవసాయ కూలీలు, నిరుపేదలకు ఆ పథకం వర్తించని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలన్నింటికీ ప్రయోజనం చేకూరేలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని రూపొందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు బీమాను ప్రభుత్వం ఎత్తివేసిందంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అర్హులకు తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. తన నియోజకవర్గంలో రెండున్నర సంవత్సరాల వ్యవధిలో 6,500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు అందించడంతో పాటు, గ్రూపులోని మహిళ మరణిస్తే ఆమె తీసుకున్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. వృద్ధాప్య పెన్షన్లను కూడా త్వరలో అందించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మధుసూదన్ రాజ్, తహసీల్దార్ వివేక్, ఎంపీవో హరీష్, కేసముద్రం సింగిల్ విండో వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, గుగులోతు దసురు నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ నీలం దుర్గేష్, ఉపసర్పంచ్ నాగుల్ మీరా, కాలే కట్టయ్య, కొయ్యడ అశోక్, బోరెడ్డి వీరారెడ్డి, రావుల కొమురయ్య, తాళ్లపల్లి ఐలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.