BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 09:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇబ్రహీంపట్నంలో మద్యం మత్తులో టిప్పర్ బీభత్సం.. డ్రైవర్‌కు 15 రోజుల జైలు శిక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 09:50 PM
13 వీక్షణలు

650.3గా నమోదైన మద్యం మోతాదు.. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన డ్రైవర్‌పై కఠిన చర్యలు జరిమానాతో సరిపెట్టని న్యాయస్థానం.. నిందితుడిని జైలుకు తరలింపు విజయవాడ, నవంబర్ 20: మద్యం మత్తులో భారీ వాహనాన్ని నడుపుతూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన టిప్పర్ డ్రైవర్‌కు న్యాయస్థానం 15 రోజుల జైలు శిక్ష విధించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో తప్పించుకోలేరని, జైలు శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన బత్తుల మధుసూదన్ రావు (44) ఏపీ 31 టీడీ 9129 నంబరు గల టిప్పర్ వాహనంలో బూడిద లోడుతో ఇబ్రహీంపట్నం రింగ్ వైపు వెళ్తున్నాడు. అయితే మద్యం మత్తులో ఉన్న అతడు అతివేగంగా, నిర్లక్ష్యంగా టిప్పర్ నడపడమే కాకుండా వాహనంలో ఉన్న బూడిదను ప్రధాన రహదారిపై పడవేస్తూ ప్రయాణించాడు. దీంతో వెనుక వచ్చే వాహనదారులు, రహదారిపై ప్రయాణించే ప్రజలకు తీవ్ర ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంది. భారీ వాహనాన్ని మద్యం మత్తులో నడుపుతూ రహదారిపై బూడిదను చల్లుకుంటూ వెళ్లడం పట్ల పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ విషయం ఇబ్రహీంపట్నం పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యం దృష్టికి రావడంతో వెంటనే సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టిప్పర్‌ను నిలిపివేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా ఏకంగా 650.3గా మద్యం సేవించిన స్థాయి నమోదైంది. దీంతో నిందితుడిని వాహనంతో సహా పోలీస్ స్టేషన్‌కు తరలించి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 185 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని శుక్రవారం విజయవాడ ఐదవ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. అధిక మోతాదులో మద్యం సేవించి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వాహనం నడిపిన నేరాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. విచారణ అనంతరం ఐదవ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆత్మకూరి అనిత నిందితుడు బత్తుల మధుసూదన్ రావుకు 15 రోజుల జైలు శిక్ష విధించారు. అనంతరం అతడిని విజయవాడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం చిన్నపాటి తప్పిదం కాదని, అది డ్రైవర్ ప్రాణాలతో పాటు రహదారిపై ప్రయాణించే అమాయక ప్రజల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెడుతుందని హెచ్చరించారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కేవలం జరిమానాలే కాకుండా జైలు శిక్షలు కూడా విధించే అవకాశం ఉందని ఈ తీర్పు స్పష్టం చేస్తోందన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని, రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.