BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 09:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా దళిత మహిళకు అవకాశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 09:46 PM
17 వీక్షణలు

సామాజిక న్యాయానికి ప్రాధాన్యత.. కోట పుల్లమ్మ ఎంపిక చారిత్రాత్మకం

ఎన్టీఆర్ ఆశయాలను ఆచరణలో చూపిస్తున్న చంద్రబాబు నాయుడు – ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా తొలి జిల్లా పరిషత్ చైర్మన్‌గా దళిత మహిళ కోట పుల్లమ్మకు అవకాశం కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన కోట పుల్లమ్మ, వైస్ చైర్మన్‌గా ఎన్నికైన నూతలపాటి బాల కోటేశ్వరరావులను ఎంపీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు సామాజిక న్యాయం, సమానత్వం, రాజకీయ అవకాశాల కల్పన అనే ఆశయాలతో పార్టీని స్థాపించారని, ఆ ఆశయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆచరణలో చూపిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటైన జిల్లాకు తొలి జడ్పీ చైర్మన్‌గా ఒక దళిత మహిళను ఎంపిక చేయడం ద్వారా సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలోనూ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కోట పుల్లమ్మ తెలుగుదేశం పార్టీ కోసం నిలబడ్డారని కేశినేని చిన్ని గుర్తుచేశారు. పార్టీ కోసం పోరాడుతున్న సమయంలో కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో రాజకీయాల్లో కొనసాగడం ఆమె పట్టుదలకు నిదర్శనమన్నారు. గంపలగూడెం గ్రామంలో సుమారు 8,500 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో గతంలో సర్పంచ్‌గా విజయం సాధించి తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమె జడ్పీటీసీగా, ఆమె భర్త ఎంపీటీసీగా ఎన్నికై ప్రజాప్రతినిధులుగా సేవలందించడం విశేషమన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకుల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా వారి సేవలను గుర్తించి సముచిత గౌరవం, అవకాశాలు కల్పించడం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న సంప్రదాయమని ఎంపీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం, కూటమి నాయకుల సహకారంతో కోట పుల్లమ్మకు ఈ కీలక బాధ్యత దక్కిందన్నారు. సాధారణ కేటగిరీకి చెందిన జడ్పీటీసీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ పార్టీ కోసం కష్టపడిన మహిళా నాయకురాలికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కూటమి నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారని వివరించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా కోట పుల్లమ్మ పేరును ప్రతిపాదించడం కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని తెలియజేస్తోందన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఒకే ఒక్క జడ్పీటీసీ స్థానం గెలిచినప్పటికీ మిత్రధర్మాన్ని గౌరవిస్తూ ఆ పార్టీకి చెందిన నూతలపాటి బాల కోటేశ్వరరావుకు వైస్ చైర్మన్ పదవి కల్పించడం కూటమి పార్టీల మధ్య పరస్పర గౌరవానికి నిదర్శనమని అన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లు జడ్పీటీసీ సభ్యులందరినీ కలుపుకొని జిల్లాలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. మారుమూల ప్రాంతాల్లోని సాధారణ కుటుంబాలకు చెందిన వ్యక్తులను గుర్తించి రాజకీయంగా ఉన్నత అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దే సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సాధారణ కుటుంబాలకు చెందిన వ్యక్తులకు, మహిళలకు అవకాశాలు కల్పించిన విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. అదే స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా కోట పుల్లమ్మకు బాధ్యతలు అప్పగించడం సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిచ్చే నిర్ణయమని పేర్కొన్నారు. రాజకీయాల్లో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు, గౌరవం లభిస్తాయని ఈ ఎంపిక మరోసారి చాటిందని కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నా

రు.