BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 09:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర శ్రీనిధి విద్యార్థుల క్రీడా ప్రతిభ.. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు భువన్ తక్షక్ ఎంపిక

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 09:37 PM
14 వీక్షణలు

ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థినులు.. ఒకే రోజు నలుగురి ప్రతిభకు గుర్తింపు మధిర: క్రీడారంగంలో మధిర శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ ఉన్నత స్థాయి పోటీలకు ఎంపికవుతూ పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ ఎంపిక పోటీల్లో శ్రీనిధి విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి, ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. శుక్రవారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల స్థాయిలో నిర్వహించిన అండర్‌-14 బాలుర కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థి రెడ్డి భువన్ తక్షక్ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విద్యార్థి ఈ నెల 22, 23, 24 తేదీల్లో మహబూబాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. చిన్న వయసులోనే తన ఆటతీరుతో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల పాఠశాల వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా మామునూరులో శుక్రవారం నిర్వహించిన అండర్‌-17 బాలికల కబడ్డీ పోటీల్లో మధిర జట్టు తరఫున పాల్గొన్న శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థినులు బట్టు చైత్ర, ఉదయశ్రీ, అమ్ములు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఒకే రోజు ఒక విద్యార్థి రాష్ట్రస్థాయికి, ముగ్గురు విద్యార్థినులు ఉమ్మడి జిల్లా స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణంగా మారింది. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి ప్రోత్సహిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి, కరస్పాండెంట్ డి. అంజన్ బాబు, డైరెక్టర్ సి.హెచ్. చందు, ప్రిన్సిపాల్ డి. శ్రీనివాసరావు, పీడీ ప్రవీణ్ కుమార్, పీఈటీ శివ, ఉపాధ్యాయులు ఎంపికైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొని పాఠశాలకు, మధిర ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.