BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 15 June 2026, 08:21 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేటి నుంచే ఇంటింటి ఓటర్ల సర్వే ప్రారంభం – నెల రోజుల పాటు ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jun, 2026 - 08:21 AM
123 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ నేటి (సోమవారం) నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే జూలై 14 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఈ సర్వేలో పాల్గొంటున్నారు. సర్వే సమర్థవంతంగా నిర్వహించేందుకు వీరికి ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.

ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలు

సర్వేలో భాగంగా ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనున్నారు. వాటిలో ఓటరు పేరు, చిరునామా, పాత ఫోటో, ఎపిక్ నంబర్ ముందే ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు స్వయంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

బీఎల్వోలు ఈ నెల రోజుల్లో కనీసం మూడు సార్లు ప్రతి ఇంటిని సందర్శించి ఫారాలు అందజేయడం, తిరిగి సేకరించడం చేస్తారు. పూర్తి చేసిన ఫారాలను జూలై 14లోగా తప్పనిసరిగా సమర్పించాలి. సమర్పించని వారి పేర్లు జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండవు.

మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి

2002 ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ప్రస్తుత ఓటర్ల వివరాల మ్యాపింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 4.16 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2.68 కోట్ల మందికి పైగా (64.6 శాతం) మ్యాపింగ్ పూర్తయింది. మిగిలిన సుమారు 1.47 కోట్ల ఓటర్ల వివరాలను ఈ సర్వే ద్వారా పూర్తిచేయనున్నారు.

విదేశాల్లో/ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి అవకాశం

ఉద్యోగ, వ్యాపార కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల తరఫున కుటుంబ సభ్యులు ఎన్యుమరేషన్ ఫారాలను నింపి బీఎల్వోలకు అందించవచ్చు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు గరిష్టంగా 50 ధ్రువీకరించిన ఫారాలను సమర్పించేందుకు అనుమతి ఉంది.

బీఎల్వోలకు ఓటర్ల పేర్లను నేరుగా తొలగించే అధికారం లేదు. ఫారం సమర్పించని సందర్భాల్లో క్షేత్రస్థాయి విచారణ, నోటీసులు, వివరణ అవకాశాలు ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారు.