BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 10 March 2026, 04:52 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్యార్థులకు విద్యా మెటీరియల్ పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
10 Mar, 2026 - 04:52 AM
589 వీక్షణలు

8వ వార్డు మెంబర్ కొమ్ము నగేష్ ప్రోత్సాహం

NTODAY NEWS: బొమ్మలరామారం

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. గ్రామ సర్పంచ్ బట్కీరు బీరప్ప జన్మదినం సందర్భంగా మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ 8వ వార్డు మెంబర్ కొమ్ము నగేష్ పాఠశాల అధ్యాపకుల సమక్షంలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, స్కేలు వంటి విద్యా మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్ము నగేష్ మాట్లాడుతూ, పదవ తరగతి ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు వాహనదారులు సహకరించాలని కోరారు. విద్య జీవితంలో అత్యంత విలువైనదని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగినేనిపల్లి గ్రామ ఉపసర్పంచ్ రామిడి దయాకర్ రెడ్డి, గులన్ గణేష్, ఇప్పలపల్లి కుమార్, బొమ్మగల నగేష్, ముడుగుల నరసింహ, మద్దూరి విజయ్, బొమ్మగల సురేష్, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. #EducationSupport #SchoolStudents #Bommalaramaram #YadadriBhuvanagiri #NTodayNews #StudentSupport Follow us on Website Facebook Instagram YouTube