BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 July 2026, 06:05 am
Posted by : JP.NAGIREDDY

అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
10 Jul, 2026 - 06:05 AM
129 వీక్షణలు

రాయచోటి | జూలై 9, 2026

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని సందీప్ జూనియర్ కళాశాలలో జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ABVP విభాగ SFD కన్వీనర్ జేపీ నాగిరెడ్డి మాట్లాడుతూ, 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం నలుగురు సభ్యులతో ప్రారంభమైన ABVP నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగిందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు ఎదుర్కొనే ప్రతి సమస్యపై పోరాడుతూ, విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

సందీప్ జూనియర్ కళాశాల యాజమాన్య ప్రతినిధి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ABVP కేవలం విద్యార్థి సమస్యలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ జగన్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని "వివేకానంద మాట – ABVP బాట" అనే నినాదంతో యువతలో దేశభక్తి, సేవా భావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ABVP కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు విజయ్ మహరాజ్, విజయ్ పెసల, రామ్ ప్రసాద్, కిషోర్, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.