BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 05 July 2026, 09:04 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
05 Jul, 2026 - 09:04 PM
105 వీక్షణలు

చిత్తూరు జిల్లా | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన రాజకీయ పరిపాలన కోసం పోలీసు, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు.

పేదల పక్షాన నిలబడి పనిచేసే తెలుగుదేశం పార్టీ నాయకులను అధికారులు గౌరవించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పరిశీలించి, ఎక్కడైనా లోపాలు లేదా ఇబ్బందులు ఉంటే వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

అలాగే పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, "ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు (ఛారిటీ) చేద్దాం... పార్టీ ద్వారా రాజకీయాలు చేద్దాం" అని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు, రాజకీయ కార్యకలాపాలను వేర్వేరుగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.