BREAKING
thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన
Date of Publish : 05 July 2026, 09:24 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ క్లినిక్ హైదరాబాద్‌‌లో ప్రారంభం

తెలంగాణ
/ తెలంగాణ
05 Jul, 2026 - 09:24 PM
96 వీక్షణలు

హైదరాబాద్ | NTODAY NEWS

ట్రాన్స్‌జెండర్ సమాజానికి ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ప్రత్యేక ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ప్రారంభమైంది.

ఈఎస్‌ఐసీ ఆసుపత్రి మరియు 'క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్' సంయుక్తంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి అవసరమైన సమగ్ర వైద్య సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడమే ఈ క్లినిక్ ప్రధాన లక్ష్యం.

ఈ క్లినిక్‌లో జనరల్ హెల్త్ చెకప్‌లు, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, హార్మోన్ థెరపీ, ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. వివక్షకు తావు లేకుండా, సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణంలో వైద్య సేవలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఈ క్లినిక్ కీలక మైలురాయిగా నిలుస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.