BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 04 July 2026, 04:48 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
04 Jul, 2026 - 04:48 PM
97 వీక్షణలు

విజయవాడ | NTODAY NEWS

స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ రామకృష్ణాపురంలో క్షత్రియ యువత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు దేశభక్తి, త్యాగం, ధైర్యసాహసాలకు ప్రతీక అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన చేసిన త్యాగాలు, చూపిన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారి సేవలను చిరస్థాయిగా గుర్తుంచుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్‌ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, కాకర్లపూడి బ్రహ్మరాజు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ డి.జె.పి.ఎన్. రాజు, కల్లేపల్లి సాయిరామరాజు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు లక్కంరాజు శ్రీనివాసరాజు, డివిజన్ ఇన్‌చార్జ్ వెంకటరమణ, భద్రం, గొట్టుముక్కల వెంకటేశ్వరరాజు, రత్నకుమారి, రమేశ్ వర్మ, సుధీర్ వర్మ, క్షత్రియ యువత సంఘం ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.