BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 03 July 2026, 05:50 pm
Posted by : SANADI KARNAKAR

బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మేడ్చల్
Reporter
Sanadi karnakar మేడ్చల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్
03 Jul, 2026 - 05:50 PM
111 వీక్షణలు

మేడ్చల్–మల్కాజిగిరి | NTODAY NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లి పూజిత ఎంక్లేవ్‌లో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలను హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కొలను హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు మహిళల్లో ఆనందం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభుత్వం అండగా నిలుస్తూ సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధికి పునాది అని, మహిళా సాధికారతకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో డ్వాక్రా గ్రామ అధ్యక్షురాలు ఇందిరా కడియాల, యశోద, శ్రీవాణి, జ్యోతితో పాటు కాలనీలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.