BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 02 July 2026, 01:34 pm
Posted by : SANADI KARNAKAR

కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ
/ తెలంగాణ / మేడ్చల్-మల్కాజిగిరి / మేడ్చల్
Reporter
Sanadi karnakar మేడ్చల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్
02 Jul, 2026 - 01:34 PM
128 వీక్షణలు

కుత్బుల్లాపూర్ | NTODAY NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు అనారోగ్యంతో చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.3.50 లక్షల విలువైన చెక్కులను కాంగ్రెస్ నాయకుడు, డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు.

వెంకట్రావు, లావణ్య, మోహన్, శంకర్ నాయుడు, స్వరూప తదితరులు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం మొత్తం రూ.3.50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఈ చెక్కులను షాపూర్ నగర్‌లోని తన నివాసంలో బాధితులకు శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

సహాయం పొందిన లబ్ధిదారులు తమకు ఆర్థిక చేయూత అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, కూన శ్రీనివాస్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాసరెడ్డి, సిహెచ్ బుచ్చిరెడ్డి, మోతే శ్రీనివాస్ యాదవ్, షాకీర్, రఘు గౌడ్, వెంకట్ రెడ్డి, శంకర్ గౌడ్, లక్ష్మణ్, కనకరాజు, రాకేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.