BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 02 July 2026, 02:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సవాళ్లు - ప్రతి సవాళ్లు.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన అప్పులు, అవినీతి ఆరోపణలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 02:39 PM
104 వీక్షణలు

హైదరాబాద్, జులై 2: తెలంగాణ రాజకీయాలు మరోసారి సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణల అంశాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ బహిరంగ చర్చలకు సిద్ధమని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ప్రభుత్వ అప్పుల అంశంపై చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నేరుగా సవాల్ విసురుతూ, ఆయన సిద్ధమైతే తెలంగాణ భవన్‌కు వస్తానని పేర్కొన్నారు. దీంతో గురువారం ఉదయం కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణ భవన్‌కు చేరుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇక గురుకులాల టెండర్లలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. ఈ అంశంపై కేటీఆర్, హరీశ్ రావులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ వెల్లడించారు. అవసరమైతే గన్‌పార్క్‌కు వెళ్లి ప్రజల ముందే చర్చిస్తామని స్పష్టం చేశారు.

ఈ సవాళ్లకు బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రతి సవాల్ విసిరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 11 గంటలకు ఆధారాలతో చర్చకు వస్తానని ప్రకటించారు. దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కూడా ప్రెస్‌క్లబ్‌కు వచ్చి చర్చిస్తారని తెలిపారు.

కేటీఆర్‌పై మంత్రి అడ్లూరి మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అప్పులపై నిజంగా చర్చించాలంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆరోపణలు చేయడం మాత్రమే కాదు, వాటిని నిరూపించే ధైర్యం కూడా ఉండాలని హరీశ్‌రావును ప్రశ్నించారు. రూ.1100 కోట్ల టెండర్లలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని ఎలా చెబుతున్నారని నిలదీశారు.

అదే సమయంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చిట్టా తమ వద్ద ఉందని, అందరి లెక్కలు బయటపెడతామని మంత్రి అడ్లూరి హెచ్చరించారు. రాజకీయ ఆరోపణల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో భారీగా అప్పులు చేసిందని బీఆర్ఎస్ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ కూడా ఎదురుదాడికి దిగింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. గత పదేళ్లలో అత్యధిక అప్పులు చేసిన పార్టీ బీఆర్ఎస్‌నే అని విమర్శిస్తున్నారు.

దీంతో తెలంగాణ రాజకీయాల్లో అప్పులు, అవినీతి ఆరోపణలు ఇప్పుడు కొత్త రాజకీయ సమరానికి తెరలేపాయి. బహిరంగ చర్చలు నిజంగా జరుగుతాయా? లేక సవాళ్లు, ప్రతి సవాళ్లకే పరిమితమవుతాయా? అన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నెలకొంది.