BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 01 July 2026, 06:32 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
01 Jul, 2026 - 06:32 PM
103 వీక్షణలు

చిలకలూరిపేట | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

బుధవారం రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్తో కలిసి చిలకలూరిపేట పట్టణంలోని 11, 29 వార్డుల్లో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం యడ్లపాడు, నాదెండ్ల గ్రామాల్లో కూడా పింఛన్లు పంపిణీ చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 65 లక్షల కుటుంబాలకు సామాజిక పింఛన్లు అందుతున్నాయని, మిగతా కుటుంబాలకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. రాష్ట్రంలోని దాదాపు 80 శాతం కుటుంబాలు ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్నాయని పేర్కొన్నారు.

చిలకలూరిపేట పట్టణంలోనే ప్రతి నెలా సుమారు రూ.4.75 కోట్ల విలువైన సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని ఆయన అన్నారు.

రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీతో పేద కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంటోందన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గాలు, పార్టీలు, ఓట్లకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.