BREAKING
thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి
Date of Publish : 01 July 2026, 07:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వి.బి. జిరామ్‌జీ పథకాన్ని రద్దు చేయాలి – ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఏ చట్టాన్ని పునరుద్ధరించాలి: వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:46 PM
107 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని ఉపాధి హామీ పని ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు వి.బి. జిరామ్‌జీ పేరుతో కొత్త విధానాన్ని తీసుకువస్తోందని ఆరోపించారు.

ఉపాధి హామీ చట్టం అమలును బలహీనపర్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ కొత్త విధానం ఉందని, రెండు ఫోటోల విధానం కూడా అదే కుట్రలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి కూలీలు ఐక్యంగా పోరాడి ఈ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

అనంతరం విస్సన్నపేట, కొండపర్వ, తాతకుంట్ల గ్రామాల్లో ఉపాధి కూలీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తర్వాత ఏపీఓ రామారావుకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకుడు మేకల జ్ఞానరత్నం, సీఐటీయూ మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.