BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 01 July 2026, 08:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కరీంనగర్‌లో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 08:10 PM
198 వీక్షణలు

కరీంనగర్‌లో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపోలో పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఇటీవల తిమ్మాపూర్‌లో జరిగిన ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదంపై ఇంకా స్పష్టత రాకముందే మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన జేబీఎం సంస్థ నిపుణుల బృందం ఇప్పటికీ పూర్తి నివేదికను వెల్లడించలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 అక్టోబర్‌లో జేబీఎం సంస్థ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసింది. అయితే వరుసగా మూడోసారి అగ్నిప్రమాదం జరగడంతో ఈ బస్సుల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా ఘటన నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.