BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 03 July 2026, 04:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జులై 16, 17, 18 తేదీల్లో 'తల్లికి వందనం' డబ్బులు జమ: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 04:49 PM
142 వీక్షణలు

అమరావతి, జులై 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం కింద రెండో విడత నిధులను జులై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లు నిర్వహించి, అదే సమయంలో నిధుల విడుదల ప్రక్రియ చేపడతామని తెలిపారు.

విద్యాభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది తల్లులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అదే విధంగా, జులై 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాల అమలుపై ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు లోకేశ్ వెల్లడించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని మంత్రి లోకేశ్ సూచించారు.