BREAKING
thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
Date of Publish : 03 July 2026, 12:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బలివాడ కాంతారావు జయంతి ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 12:32 PM
125 వీక్షణలు

గంపలగూడెం, జూలై 3: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక బీసీ పాఠశాలలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బలివాడ కాంతారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరసవెల్లి అనూష మాట్లాడుతూ బలివాడ కాంతారావు తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన మహోన్నత రచయిత అని పేర్కొన్నారు. ఆయన 38 నవలలు, 400కు పైగా చిన్నకథలు, 8 నాటకాలు, యాత్ర కథనాలు, వ్యాసాలు రచించి తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు.

అలాగే ఆయన రచించిన "పుణ్యభూమి" నవలకు 1972లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందని, "బలివాడ కాంతారావు కథలు" కథా సంకలనానికి 1988లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కిందని చెప్పారు. సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలకు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, సన్మానాలు లభించాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షులు నంబూరి శ్రీనివాసరావు, శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, సీఆర్పీ సంగెపు చిన్న నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.